మనమే మీడియా
తేది: 25-11-2025. పాలవలస, గుర్ల మండల కేంద్రం.
“అన్నదాత” కు అండగా తెలుగుదేశం.
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .
పంచ సూత్రాల అమలుతో రైతు అభివృద్ధి సాధ్యం.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో, చీపురుపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి సూచనలతో, చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలంలో “రైతన్నా! మీ కోసం” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాలవలస గ్రామంలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి ప్రారంభించారు. రైతు కుటుంబాలను పలకరించి రైతు సంక్షేమం కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రైతుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, గత 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు రైతు సంక్షేమం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు “అన్నదాత సుఖీభవ” పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రెండు విడతలుగా వారి ఖాతాల్లో 14000 రూపాయలు జమ చేయడం జరిగిందని, ఎవరికైనా జమ కానిచో సంబంధిత అధికారులను లేదా పార్టీ కార్యకర్తను సంప్రదించాలని తెలియజేస్తూ. రైతు పండించే ప్రతి గింజ ప్రతి పంట మన రాష్ట్రానికి బలమని, రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు రైతులేనని, వారి బాగోగులు, అభివృద్ధి, సంక్షేమం చూడాల్సిన బాధ్యత అటు సంబంధిత అధికారులపైన, ఇటు ప్రతి కార్యకర్త పైన ఉందని తెలియజేస్తూ, చంద్రబాబు గారి పిలుపు మేరకు స్వర్ణాంధ్ర@2047 అనుగుణంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు 2004 నాటికి ప్రజల తలసరి ఆదాయం 55 లక్షలు గా చేయడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటూ, ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే వ్యవసాయ రంగంలో “పంచ సూత్రాల” ను రూపొందించడం జరిగిందని తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు వంటి పంచ సూత్రాలు అమలు చేస్తే రైతు సంపన్నుడు కాగలడని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గేదెల అప్పలనాయుడు, సుంకరి ఉపేంద్ర, వల్లూరు భాస్కరనాయుడు, చిన్నంనాయుడు, రైతు సోదరులు పల్లేడ సూర్యనారాయణ, కొండ్రోతు సీతంనాయుడు, తాడి నారాయణరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

