మనమే మీడియా పార్వతీపురం: విజయనగరం, పార్వతీపురం మన్యం ఉమ్మడి జిల్లాకు సైనిక సంక్షేమ అధికారి గా మజ్జి కృష్ణారావు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో కృష్ణారావు ఇదే జిల్లాలో సైనిక సంక్షేమ అధికారిగా సేవలందించారు. అనంతరం ఎన్నికల సందర్భంలో కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పుడు రాష్ట్ర సైనిక సంక్షేమ విభాగం డైరెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ ఉమ్మడి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈసీహెచ్ఎస్, మిమ్స్ ఆస్పత్రి ఎంపానెల్మెంట్, వార్ మెమోరియల్ నిర్మాణాలకు ఆయన కృషి ఎనలేనిది.

