మనమే మీడియా,తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పాలవంచ పోలీసు డివిజనల్ ఆఫీసర్ సతీష్ కుమార్ . అందులో భాగంగా సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాముఖంగా చేపడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్స్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రాజకీయ పార్టీల నాయకులు ఎటువంటి దుచర్యలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేందుకు సహకారం అందించాలని అన్నారు .సలహాలు సూచనలు ఏమైనా ఉంటే అధికారులను సంప్రదించి నామినేషన్ పత్రాలు అందించాలని అన్నారు ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే వాటిని బయటనే పరిష్కరించుకోవాలని తెలిపారు .నామినేషన్స్ వేస్తున్న క్రమంలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ,అంతరాయం ఏర్పరచకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేందుకు కేంద్రాల వద్ద హడావుడి చేయకుండా ఉండాలని కోరారు .స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటును ఉపయోగించుకునేందుకు మరియు అభ్యర్థిని ఎన్నుకునేందుకు తమకు నచ్చిన అభ్యర్థులును ఎన్నుకోవచ్చు అని అన్నారు ఈ క్రమంలో శాంతిభద్రతలకు ఆటంకాలు కలిగించకుండా ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి సహకరించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సబ్ ఇన్స్పెక్టర్ మేడా ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది ఎన్నికల అధికారులు గ్రామపంచాయతీ అధికారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

