ప్రజలకు పండగ ఆనందం లేదు కూటమి ప్రభుత్వంపై ధ్వజం ఎత్తిన జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు.

మనమే మీడియా చీపురుపల్లి అసెంబ్లీ,19 Jan 2026.
రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రజలు ఆనందంగా లేరు అని ఎంతో మంది భర్తలు చనిపోయి 18 నెలలుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వితంతువులు, 60 సవత్సరాలు దాటినా పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న అవ్వాతాతలు,అర్హులు అయిన వికలాంగులు, వారిజీవితాల్లో పండగ ఆనందం ఆనందం లేదు కూటమి ప్రభుత్వంపై ధ్వజం ఎత్తిన జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు.

_రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో సైకో కూటమి ప్రభుత్వం నాయకులు వితంతువులు, అవ్వాతాతలు, వికలాంగుల మీద కూడా పెన్షన్ కి అర్హత వున్నా సరే ఇవ్వకుండా కక్షశాధింపు చేస్తున్న దుర్మార్గ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా వున్నారు అని వలిరెడ్డి శ్రీనివాసనాయుడు హెచ్చరించారు. కూటమి నాయకులు వాళ్ళకి వాళ్లే ఇది మంచి ప్రభుత్వం అనే స్లోగన్ చెప్పుకుంటున్నారు వారి జబ్బలు వారే చరుచు కుంటూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు అని అయితే రాష్ట్ర ప్రజలకి ఇది మంచి ప్రభుత్వం కాదు నమ్మిన ప్రజలని ముంచే ప్రభుత్వం అని 18 నెలల పరిపాలనలోనే అర్ధం అయ్యింది అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రతి మీటింగులోను మేము సూపర్ సిక్స్ హామీలు అన్ని ప్రజలకు అందించేసాం అని చెప్తున్నారు అని,వాస్తవానికి సూపర్ సిక్స్ హామీల్లో ప్రధాన మైన ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకు 1500/- ఇస్తామన్న 18000 వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారని కూటమి అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం ముగుస్తుందని ఈ రాష్ట్రంలో మహిళల ఉసురు మీ కూటమి ప్రభుత్వ్వానికి తప్పకుండా తగులుతుందని 2029 ఎన్నికల్లో మహిళలు కన్నీటిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ ఏడాది జనవరి1వ తేదీన జాబ్ కేలండర్ అన్నాడు లోకేష్ 2 సవత్సరాలు అవుతుంది లోకేష్ బాబు జాబ్ క్యాలెండర్ ఎక్కడ సవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ బాబు గారని ఉద్యోగం ఇవ్వని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎక్కడ, ఎప్పుడు ఇస్తారు రాష్ట్రంలో వున్న నిరుద్యోగ సోదరులకు నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వున్న నిరుద్యోగులు మట్టిలో గొయ్య తీసి పాతడానికి నసిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో చాలా చోట్ల తెలుగుదేశం,జనసేన నాయకులు బహిరంగ ప్రదేశాల్లో గ్రామాల్లో రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేసి యువతను పెడదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలుకి ప్రభుత్వం అడ్డుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడం వలన రాష్ట్రం పరువు బజారున పడిందని, ఇలాంటి కార్యక్రమాల వలన మహిళలు మీద లైంగిక దాడులు, హత్యాచారాలు జరిగే ప్రమాదం వుందని అన్నారు. ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా వున్న రాష్ట్రంలో ఇంత నీచంగా అర్ధనగ్న ప్రదర్శనలు జరగం చాలా విచారిందగ్గ విషయం అని, రాష్ట్రంలో వున్న మహిళలు, మహిళా సంఘాలు ముక్త కంఠంతో దీన్ని కండించవలసిన అవసరం వుంది అని వలిరెడ్డి హెచ్చరించారు.వైస్సార్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేస్తుంది అని,అధికారంలో లేకపోతె ప్రజలకు అండగా నిలబడి వారితరుపున నిరంతరం పోరాడుతుంది అని మీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు చెప్పిన హామీలు అన్ని ప్రజలకు అందించే వరకు వైస్సార్ పార్టీ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకోసం పోరాడుతుంది అని జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తెలియజేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *