బుదరాయవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పీటీఎం

బుదరాయవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పీటీఎం : విజయనగరం జిల్లా, మెరకముడిదాం మండలం బుదరాయవలస zphs లో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ( మెగా పీటీఎం 3.0) ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున విద్యార్థులు,తల్లితండ్రులు హాజరయ్యారు. విద్యార్థులు కోలాటం, స్కిట్స్ వేసి నవ్వులతో అలరించారు. టీడీపీ నాయకులు బాలి మహేష్ , బీజేపీ మండల అధ్యక్షులు రామునాయుడు , సర్పంచ్, ఎంపీటీసీ, వైస్ సర్పంచ్, స్కూల్ చైర్మన్, వైస్ చైర్మన్, యువత పాల్గొన్నారు.అనంతరం మిడ్ డే మీల్స్ తో పాటు బాలి మహేష్ విద్యార్థులకు, తల్లితండ్రులకు 300 స్వీట్స్ అందజేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *