మనమే మీడియా,బలిజిపేట:
బలిజిపేట ఎంఈఓ 1 సామల సింహాచలం
విద్యార్థులందరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట ఎంఈఓ 1 సామల సింహాచలం అన్నారు. బుధవారం ఆయన బలిజిపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఇన్చార్జ్ హెచ్ఎం బి వెంకటరమణ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.విద్యార్థినీ, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26 న భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. రాజ్యాంగం ద్వారానే పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం లభించాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అమరావతిలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని ప్రత్యేకంగా నిర్వహించిన విషయాన్ని విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగం లోని ప్రాథమిక విధులు, హక్కులు, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇదే సందర్భంగా స్టూడెంట్స్ అసెంబ్లీ లైవ్ కార్యక్రమాన్ని ప్రతి తరగతిలో విద్యార్థులందరూ వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం బి వెంకట రమణ,బొత్స గణేష్ , సింహాద్రి,ఉషారాణి, జానకమ్మ, శ్రీదేవి త్రినాధరావు,అప్పారావు, జ్యోతి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

