మనమే మీడియా,e Paperశ్రీకాకుళం జిల్లా పోలీసు; భార్యను హతమార్చిన కేసులో ముద్దాయి (జీరు వెంకట రమణ) కి శ్రీకాకుళం గౌరవ మొదటవ అదనపు న్యాయస్థానం జడ్జి శ్రీ పి భాస్కరరావు వారు జీవిత ఖైదు శిక్షను ప్రకటించారు అని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
కర్ణపు నీలమ్మ గ్రామం అను పిర్యాదుదారుని ఇచ్చిన రిపోర్ట్ మేరకు, ముద్దాయి (జీరు వెంకట రమణ)తన భార్య జీరు రమణమ్మ (వయసు 24 ఏళ్లు) వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాదని అనుమానంతో ఒక సంవత్సరంగా ఆమె తన కన్నా వారి ఇంటిలో నివసిస్తున్నట్లు. అనంతరం ముద్దాయి తండ్రి మరణంతో, అంత్యక్రియల నిమిత్తం భార్య జీరు రమణమ్మ ఇంటికి వచ్చినది. అదే రోజున
తేదీ 14.03.2018 సాయంత్రం 17.30 గంటలకు, బాణం గ్రామంలోని ముద్దాయి ఇంటి వద్ద ముద్దాయి మరియు రమణమ్మ మధ్య వాగ్వాదం జరిగి, ఆమె “తనతో కలిసి ఉండను” అని స్పష్టం చేయడంతో, ఆగ్రహంతో ముద్దాయి పదునైన కత్తితో ఆమె మెడపై విచక్షణారహితంగా దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పిర్యాదులో పేర్కొనబడింది.ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు అధికారి అయిన అప్పటి సిఐ, జేఆర్‌పురం సర్కిల్ శ్రీ వై. రామకృష్ణ గారు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.తరువాత ముద్దాయి బెయిల్‌పై విడుదలై కొన్ని వాయిదాలకు హాజరై, అనంతరం గత ఐదేళ్లుగా కోర్టుకు హాజరు కాకపోవడంతో గౌరవ జిల్లా మొదటి అదనపు జడ్జి కోర్టు శ్రీకాకుళం వారు ముద్దాయి పై నాన్ బెయిల్ బుల్ వారంటు జారీ చేశారు. శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి వారి ఆదేశాల మేరకు, శ్రీకాకుళం పట్టణ డిఎస్పి సూచనలు మేరకు ఆందోళన సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ముద్దాయి ఉన్నచోట విచారణ జరిపి, గుంటూరు పట్టణంలో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.తదుపరి కోర్టు కేసును త్వరితగతిన విచారణ కోసం ట్రయల్ షెడ్యూల్‌ను ప్రకటించింది.ఈ నేపథ్యంలో కేసులోని సాక్షులఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆమదాలవలస సర్కిల్ మరియు సబ్‌ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పొందూరు పోలీస్ స్టేషన్ వారు సమన్వయం, సాక్షుల పక్కా హాజరుపరిచారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కింజరాపు శ్రీనివాసరావు గారు వాదనలు వినిపించగా, కోర్టు ట్రయల్‌ను వేగవంతంగా పూర్తి చేసింది.తీర్పు ప్రకారం, ముద్దాయి పై నేరాలు పూర్తిగా రుజువు కావడంతో—సెక్షన్ 302 IPC,సెక్షన్ 498-A IPC క్రింద జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 2,000/- జరిమానా విధిస్తూ, గురువారం 27.11.2025 న మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీ పి. భాస్కరరావు గారు తీర్పు వెలువరించారు.
జిల్లాలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఇలాంటి కేసుల్లో చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

