మనమే మీడియా,పులివెందుల;ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల,పులివెందులలో ఎన్.ఎస్.ఎస్. యూనిట్ – వన్ అండ్ టూ మరియు *జన విజ్ఞాన వేదిక,పులివెందుల* వారి ఆధ్వర్యంలో *భారత రాజ్యాంగ దినోత్సవ.. అవగాహన సదస్సు ను నిర్వహించడం జరిగినది. ఈ సదస్సు లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. సదస్సు కు కళాశాల *ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసులు* అధ్యక్షత వహించారు. ఈ సదస్సు లో జన విజ్ఞాన వేదిక జాతీయ సమాచార కార్యదర్శి పి.సనావుల్లా మాట్లాడుతూ…” భారత రాజ్యాంగం ప్రతి సంవత్సరము నవంబర్ 26 న ‘సంవిధాన్ దివాస్’ ను జరుపుకుంటున్నామని… భారత రాజ్యాంగం ఇంగ్లీష్,హిందీ భాషల్లో చేతి వ్రాతలతో రాశారు అని వివరించారు. దేశ ఔనిత్యానికి,గొప్పతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మనందరి స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాతృత్వం లను పెంపొందిస్తుదని..
రాజ్యాంగం మనందరి కి ఒక గొప్ప వరమని,రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.మన రాజ్యాంగం పవిత్రతను, విలువలను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఎన్.ఎస్.ఎస్ యూనిట్ వన్ కోఆర్డినేటర్ డాక్టర్ యు.శ్రీనిత, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ “భారతదేశం ఊపిరి గౌరవం ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై ఉన్నది. పాఠశాలల్లో ప్రార్థన సమయంలో విధిగా భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించాలని అన్నారు .” బాలల్లో రాజ్యాంగ విలువలు, లక్షణాలు,హక్కులు ఆర్టికల్స్ మీద పూర్తి అవగాహన కల్పించడం వల్ల వారిని ‘ఉత్తమ పౌరులుగా’ తీర్చి దిద్దవచ్చు అని వివరించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.
*ఈ కార్యక్రమంలో అధ్యాపక,అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.*
Post Views: 22

