మనమే మీడియా:విజయనగరం
విజయనగరం 29 వ వార్డు పరిధిలో రామకృష్ణ నగర్ లో సుమారు 135 మంది నివాసం ఉన్నారు. విరికి రోడ్లు, కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని. వర్షం వస్తే ముంపుకి గురవితున్నారని కావున తక్షణమే రోడ్లు, కాసలువలు తీయాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర రావు డిమాండ్ చేశారు. రోడ్లు కాలువలు కోసం ఈరోజు 33వ సచివాలయం వద్ద జరిగిన ధర్నా లో అయన మాట్లాడుతూ పైవిధంగా డిమాండ్ చేసారు. అలాగే చెట్లు పెరిగి కరెంటు స్థంబాలు కి తాకి ప్రమాధాలు జరిగే అవకాశం ఉంది కావున వాటిని కొట్టించాలని కోరారు. చెత్తలు ఎత్తడం లేదు, బ్లీచింగ్ చల్లడంలేదు, డైఏరియా, మలేరియా వచ్చే ప్రమాదము ఉంది కావున తక్షణమే పై సమస్యలు పరిస్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయ కులు ఎం. జగదాoబ తదితరులు పాల్గున్నారు

