రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు
చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో జరిగిన “రైతన్న మీకోసం” వారోత్సవాల్లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసన సభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మెట్టపల్లి గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు పడిన ఇబ్బందులను తొలగించి, వ్యవసాయాన్ని పండుగలా మార్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.

