మనమే మీడియా:గరివిడి నవంబర్ 25:వైద్య విద్య పేదలకు దూరం కాకూడదు, ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య కళాశాలలు కొనసాగాలి అనే ప్రధాన నినాదంతో గరివిడి మండలంలో చేపట్టిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేక కోటి సంతకాల కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. ఈ మహత్తర ఉద్యమానికి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయులు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ మరియు బొత్స అనూష తమ సంపూర్ణ మద్దతును తెలిపారు, ప్రజల్లో ఉత్సాహం నింపారు,
మండలంలోని గెడ్డపువలస, దేవడా,దుమ్మెద గ్రామాల్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గెడ్డపువలస వెలిసి వున్నా శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఈ సందర్భంగా యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, బొత్స అనూషలు మాట్లాడుతూ…
“వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ కళాశాలలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం పేద విద్యార్థుల భవిష్యత్తుకు తీరని నష్టం” అని ఆవేదన వ్యక్తం చేశారు.వారు ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలు సేకరించడంలో చురుకుగా పాల్గొన్నారు. యువ నాయకుల రాకతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. కోటి సంతకాల సేకరణలో ఈ మూడు గ్రామాల ప్రజలు చూపిన ఉత్సాహం ఈ ఉద్యమం పట్ల వారికున్న చిత్తశుద్ధిని, నిబద్ధతను తెలియజేస్తోందని డాక్టర్ సందీప్ అభినందించారు,ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్, బొత్స అనూషలకు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మీసాల విశ్వేశ్వరరావు, జడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు,మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణం నాయుడు,యలకల అప్పల నాయుడు,వైస్ ఎంపీపీ శ్రీరాములు నాయుడు, మండల ఉపాధ్యక్షులు కొనిసి కళ్యాణ్, దేవడా సర్పంచ్ అప్పల నాయుడు, jrc జగదీష్,వెదుల్లవలస సర్పంచ్ తమ్మీనాయుడు,ఎంపీటీసీ పోలీస్,సర్పంచ్ లు ఎంపీటీసీలు,మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు,

