బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కృషి చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర కమిటీ చైల్డ్ రైట్స్ ప్రొడక్షన్ ఫారం అడ్వైజర్ సిపాన గుణ ప్రసాద్ అన్నారు. ఆయన ఈ విషయం సోమవారం నాడు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేసే గడువు గత ఏప్రిల్ నెలతో ముగిసిపోయినప్పటికీ ఇప్పటివరకు కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తపరిచారు ఈ కమిషన్ సభ్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి కూడా రద్దు చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ కమిషన్ లో సభ్యులు నియామకం ఎంతో పారదర్శకంగా ఉండాలని, ఈ నియమకాలు రాజకీయాలకు అతీతంగా హైకోర్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల సమక్షంలో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు బాలల హక్కుల పరిరక్షణ బాధ్యతలు అనుభవం, నిజాయితీ ఉన్నవారికి అప్పగించినట్లయితే వారి హక్కులకు మరింత స్వేచ్ఛ కలుగుతుందని ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టితో చూడాలని ఆయన కోరారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 14–20 వరకు నిర్వహించే బాలల హక్కుల వారోత్సవం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోఅవి అంత అంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు.
14 ఏళ్ల లోపు పిల్లలను పని చేయించడం చట్ట విరుద్ధమైనప్పటికీ, అమలులో తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ,
భవనాల లేక
సిబ్బంది కొరతతో శతమత మౌతున్నాయి.
చిన్నారుల ఆరోగ్యం మరియు
పోషకాహార లోపం ఉన్నట్లు NFHS–5 నివేదిక ఈ దిగువ విధంగా ప్రకటించింది.
33% చిన్నారులు తక్కువ బరువు,
31% పిల్లల్లో పెరుగుదల లోపం
18% పిల్లలకు తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నట్లు కనిపిస్తోంది.
వేధింపులు
జువెనైల్ జస్టిస్ చట్టం మరియు బాలకార్మిక నియంత్రణ చట్టం అమలును బలపరచవలసిన బాధ్యతలను నిజాయాతీ పరులైన కమిషన్ సభ్యులకు అప్పగించవలసిన బాధ్యత ప్రభుత్వo పై ఉండని ఆయన గుర్తు చేశారు.
గ్రామ స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి,
పాఠశాలలు, గ్రామాల్లో చిన్నారుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
చిన్నారులపై హింస, దౌర్జన్యం, ట్రాఫికింగ్ కేసుల్లో వెంటనే చర్యలు తీసుకునే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, నిజాయి తీగా బాలల పరిరక్షణ సభ్యులను నియమించిన నాడే బాలల హక్కులను ప్రభుత్వం కాపాడ గలదని గుణ ప్రసాద్ గుర్తు చేశారు.

