మెరకముడదాం మండలం బుధ రాయివలస మాజీ సర్పంచ్ బాలి బంగారు నాయుడు కుటుంబం రేపు ఉదయం 10 గంటలకు చీపురుపల్లి శాసనసభ్యులు కెమిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతాయని బాలి బంగారు నాయుడు తెలియజేశారు. సుమారు 200 బైక్‌లతో మెరకముడుదాం నుంచి చీపురుపల్లి పార్టీ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ చేస్తున్నామని తెలియజేశారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ మరియు వైయస్సార్సీపి పార్టీలకు సేవలు అందించాలని ఇప్పుడు తమకు న్యాయం జరగలేదని ఆయన వాపోయారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందని నమ్మకంతో పార్టీలో చేరుతున్నామని పార్టీకి విధేయుడు నై ఉంటానని ఆయన తెలియజేశారు. యువ నాయకులు బాలి బంగారు నాయుడు తనయుడు బాలి మహేష్ ముందుండి మెరక ముడుదాం రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తానని ఆయన తెలియజేశారు.

