చీపురుపల్లి నియోజకవర్గం, మెరకముడిదాం మండలం..
స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా టీడీపీ తలుపులు తెరిసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే కళా..
మెరకముడిదాం మండలంలో వైసీపీని వీడి టిడిపిలోకి బుధరాయవలస గ్రామానికి చెందిన బాలి బంగారు నాయుడు, వారి అనుచరలతో., బుధరాయవలస నుండి చీపురుపల్లి వరకు వాహన ర్యాలీతో చీపురుపల్లి చేరుకొని సుమారు 300 కుటుంబాలతో ఎమ్మెల్యే కళావెంకట రావు గారు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు..
బంగారు నాయుడు గారి కుటుంబం, వారితో పాటు పార్టీ లోకి చేరిన అందరకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం, ఎల్లప్పుడు అందరకూ అందుబాటులో ఉంటాం, పార్టీలో ఎవరు చేరిన, మంచి గుర్తంపు ఇస్తాం, అలాగే పాత, క్రొత్త తేడా లేకుండా అందరను కలుపుకొని ముందుకు సాగుతాం అని కళావెంకట రావు గారు భరోసా ఇవ్వడం జరిగింది..
రామా మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల కోసం అందరం సమిష్టిగా కష్టపడి పని చేసి మండలంలో గల అన్నీ పంచాయతీలలో గెలుపే లక్ష్యం గా ముందుకు సాగుదాం అని తెలిపారు, ఈ సందర్బంగా పార్టీ లో చేరేవారి అందరకూ శుభాకాంక్షలు తెలియజేసారు..
ఈ కార్యక్రమంలో మెరకముడిదాం మండలం పార్టీ ప్రెసిడెంట్ తాడ్డి సన్యాసినాయుడు, కోట్ల మోతి నాయుడు, కెంగువ ధనంజయ, సుబ్బరాజు, చంటి, సన్యాసి నాయుడు, బంగారు నాయుడు. మండల ఆదినారాయణ,.దామందల సత్యనారాయణ, సర్పంచ్ తుమ్మగంటి సూరినాయుడు గారు,రెడ్డి గోవింద పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు


4 Comments