శ్రీ గాయత్రి కళాశాల కరస్పాండెంట్ శివప్రసాద్ కు ఘన సన్మానం.
చీపురుపల్లి:-
ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రైవేట్ కళాశాల యాజమాన్య ఆధ్వర్యంలో సోమవారం పిక్నిక్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చీపురుపల్లి శ్రీ గాయత్రి కళాశాల కరస్పాండెంట్ దాసరి శివప్రసాద్ కు ఏఎంసి వైస్ చైర్మన్ పదవి చేపట్టడంతో ఆయని ఉమ్మడి జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అధ్యక్షులు వెంకటేశ్వర్లు,ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి శేఖర్,ప్రసాద్,సీతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఎమ్.శశిభూషణరావు ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయనగరం ఆర్.ఐ.ఓ ఎస్.తవిటి నాయుడు,పార్వతీపురం ఆర్.ఐ.ఓ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి విజయనగరం జిల్లా ను ప్రథమ స్థానం వచ్చేటట్లు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలు ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్లు,సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

