మనమే మీడియా:గరివిడి మండలం,చీపురుపల్లి నియోజకవర్గం
*గత వైసిపి పాలనలో గరివిడిలో కళ్ళ హాస్పిటల్ ను సైతం ఆక్రమించుకొని పునాదులు వేసిన వైనం, తక్షణమే వాటిని తొలగించాలని స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందించిన స్థానిక జనసేన పార్టీ ఇన్చార్జి విసినిగిరి శ్రీనివాసరావు*
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని శ్రీరాంనగర్ మెయిన్ రోడ్ లో గల ఓఈయు లైన్స్ ఐ హాస్పిటల్ ను గరివిడి ఫెర్రో ఎల్లోయిస్ కంపెనీ శ్రీ దుర్గాప్రసాద్ షరాఫ్ వారు గరివిడిలో చాలా ఏళ్ల క్రితం 30 పడకల హాస్పిటల్ గా ప్రారంభమై నేడు 50 పడకల హాస్పిటల్ గా కొనసాగుతూ ప్రతిరోజు వందలాది మందికి వైద్యం అందించి కళ్ళ సంరక్షణ కు సంబంధించి అధునాతన ట్రీట్మెంట్ ను కల్పిస్తూ సంవత్సరానికి 2000 మంది వరకు కంటి ఆపరేషన్ లు ఉచితంగా చేస్తూ విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, ఒరిస్సా ప్రాంత ప్రజలకు నిరంతరం ఎంత ఉన్నతమైన ఆశయాలతో సేవలందిస్తున్న లైన్స్ ఐ హాస్పిటల్ గేటు ముందర గత వైసిపి పాలకులు ప్రభుత్వ భూమి అనే పేరుతో ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలను చేపట్టే ప్రయత్నం లో పునాదులు వేశారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటూ నేటి ఎన్డీఏ కూటమి నాయకులు దానిపై పోరాటం చేసి ఆపడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో హాస్పిటల్ ముందు వైసీపీ నాయకులు అండతో అక్రమంగా వేసిన పునాదులను తక్షణమే తొలగించి గతంలో ఉండు మాదిరిగా యధాస్థితిగా కొనసాగించాలని స్థానిక జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు జనసేన నాయకులు , గరివిడి మండల తహసిల్దార్ వారికి కలసి విన్నపములు అందించారు. తక్షణమే స్పందించిన స్థానిక ఎమ్మార్వో గారు దీనిపై విచారణ జరిపించి వాటిని తొలగించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది

