చినబంటుపల్లి ప్రాథమిక పాఠశాల నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మనమే మీడియా, మేరకముడిదం:ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఎంపియుపి స్కూల్ చిన్న బంటుపల్లి నందు ప్రధానోపాధ్యాయులు మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అయినటువంటి ఆల్తి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుతారని రాజ్యాంగం మొదటిసారి మొదటిసారి నవంబరు 26వ తేదీన 1949లో అధికారికంగా ఆమోదించబడిందని తెలియజేశారు ఈ రోజున నేషనల్ లా డే అని కూడా పిలుస్తారని మన కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరం లో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించింది ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను ఆయన కొనియాడారు ఈరోజు పాఠశాలలో రాజ్యాంగం ప్రతిజ్ఞ క్విజ్ పోటీలు విద్యార్థులచే మాక్ అసెంబ్లీ విద్యార్థులతో కోలాటములు సాంఘిక శాస్త్రం గొప్పదనం తెలియజేసే గీతములు ఆలపించడం జరిగింది ఈ సందర్భంగా క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు రఘునాథరాజు ఆంగ్ల ఉపాధ్యాయులు అప్పలనాయుడు జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు ప్రసన్నకుమారి ఎస్ జి టి శ్రీదేవి సూర్యకుమారి గౌరీశ్వరరావు ఎమ్ టిఎస్ కబీర్ పాఠశాల విద్యా కమిటీ వస్తుంది వైస్ చైర్మన్ ఉమా పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *