మనమే మీడియా,చీపురుపల్లి:
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ మల్లిక్ నాయుడు రైతన్నలకు అండగా నిలిచేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేశారు.*చీపురుపల్లి మండలం, పెదనడిపల్లి pacs నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ఘనంగా ప్రారంభించారు.*
రైతన్నల కోసం పంట చేతికొచ్చిన ఈ కీలక సమయంలో, దళారుల దోపిడీని అరికట్టి, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడటం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం.కష్టకాలంలో రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందనడానికి ఈ ప్రారంభోత్సవం ఒక నిదర్శనం. ప్రజల సమస్యల పరిష్కారంలో యువ నాయకత్వం ఎంత చురుగ్గా ఉందో ఈ కార్యక్రమం చాటుతోంది.
ఈ సందర్భంగా యువనేత రామ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ…
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రైతుల పక్షపాతి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం ప్రతి రైతు హక్కు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారి సూచనలతో ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ప్రతి గింజా కొనుగోలు చేసి, త్వరితగతిన నగదు చెల్లింపులు జరిగేలా చూస్తాం. రైతన్నల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను,” అని భరోసా ఇచ్చారు.
Post Views: 39

