మనమే మీడియా చీపురుపల్లి న్యూస్:
కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యాలనే నిర్ణయంకు వ్యతిరేకంగా వైస్సార్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉవ్వెత్తున ఉద్యమం లా చీపురుపల్లి మండలంలో “కోటి సంతకాల’ కార్యక్రమం
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైస్సార్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం ఈరోజు చీపురుపల్లి మండలంలో g.ములగాం, గొల్లలపాలెం గ్రామాల్లో పెద్దఎత్తున కొనసాగుతోంది. ఈ కోటిసంతకాల కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు,యువజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీ తో కలిసి పాల్గొని మహిళలు, ప్రజల మద్దతు కూడగట్టారు
**చీపురుపల్లి మండలంలో g.ములగాం, గొల్లలపాలెం గ్రామాల్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైద్య, విద్యను పేదలకుఅందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమం ద్వారా సేకరించిన సంతకాలను గవర్నర్‌కు అందజేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ ద్వారా రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు తగ్గి, పేదలకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు .
కూటమి ప్రభుత్వం పీపీపీ (ప్రజా-ప్రభుత్వ-ప్రైవేట్) విధానంలో 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించిందని,
ఈ ప్రైవేటీకరణ పేదల ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య విద్యకు భంగం కలిగిస్తుందని విమర్శించింది.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రం దాదాపు 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందని పేర్కొంది.
రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించవచ్చని, కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదనిఅన్నారు,
.ఈ కార్యక్రమంలో జిల్లా వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ,జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వల్లి రెడ్డి శ్రీనివాసనాయుడు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, సర్పంచ్ లు కరిమజ్జి శ్రీనివాసరావు, గొర్లె శ్రీరాములునాయుడు, గొర్లె వెంకటరమణ, సూర్యనారాయణ, వెంకీ, రాంకీ , కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు**

