మనమే మీడియా శ్రీకాకుళం:
నిరుపేధ గొర్రెల కాపరికి చెందిన 50 గొర్రెలను కుక్కలు దాడిచేసి చంపేయాటంతో ఆ గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక భరోసానిచ్చిన జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్,
శ్రీకాకుళం జిల్లా , ఆమదాలవలస నియోజకవర్గం,పొందూరు మండలం ,కొంచాడ గ్రామానికి చెందిన కురమానా రమణ అనే వ్యక్తికి చెందిన 42 గొర్రెలను కుక్కల దాడిలో చంపేశాయి మరొక పది గొర్రెలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి, ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆ బాధిత కుటుంబానికి బరోసనిస్తూ వెంటనే కొంత ఆర్థిక సాయం అందించి ,ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున అందవలసిన సహాయం ప్రతి ఒకటి అందిస్తామని భరోనిచ్చారు., ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎటువంటిప్రమాదాలకు గురికాకుండా శాశ్వితషెడ్లను నిర్మించుకునేందుకు ,మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నివేదిస్తానని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శిలు కొంచాడ చిన్నoనాయుడు ,చిట్టి భాస్కర్ , జిల్లా నాయకులు ముంగి జగదీష్ బొట్ట శంకర్ యాదవ్ ,జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు గార బాబురావు ,మరియు జనసేన పార్టీ నాయకులు కొంచాడ సిమ్మినాయుడు ,
శివ ,రాము ,బాలు ,రమణ ,సురేష్ జనసేన కార్యకర్తలు కూటమి నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు

