రూ. 2 కోట్లతో రహదారి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి (మనమే మీడియా):చీపురుపల్లి నియోజకవర్గంలో రూ. 2 కోట్లతో రహదారి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు
చీపురుపల్లి: నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు పేర్కొన్నారు. సోమవారం (జనవరి 5, 2026) నాడు ఆయన స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

రూ.2 కోట్లుతో చీపురుపల్లి – లావేరు రోడ్డు నుండి రావివలస, అర్థివలస మీదుగా యలకలపేట వరకు తారు రోడ్డు పునరుద్ధరణ.

ఈ పనులను NABARD నిధులతో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మాట్లాడుతూ, గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరిన ఈ రహదారి వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించామన్నారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *