మనమే మీడియా చీపురుపల్లి
తేదీ 17-04-2026
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (Society for Elimination of Rural Poverty – SERP)నియోజకవర్గ స్థాయి గ్రామ సంఘాల సహాయకులకు ప్రభుత్వం ఇచ్చిన 5Gస్మార్ట్ ఫోన్లను చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారు చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా..కళావెంకట రావు గారు మాట్లాడుతూ..
మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడం, ఆర్థిక సాధికారత కల్పించడం మరియు పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తున్న ఒక ప్రత్యేక సంస్థ SERP అని పేర్కొన్నారు..
SHG మహిళలు కు డిజిటల్ MCP ద్వారా వారికి ఎప్పుడు అప్పుడు కావాలి, ఎంత అప్పు కావాలి, ఏ ఏ జీవనిపాధులు కోసం కావాలి అనేది ముందుగా డిజిటల్ MCP ద్వారా SHG వారీగా మీటింగ్స్ పెట్టుకొని అప్పులు మన ప్రభుత్వం ఇస్తుంది. సుమారుగా ఒక్కో సభ్యురాలికి 2 నుండి 3 లక్షలు రూపాయలు వరకు మన ప్రభుత్వం ఇస్తుంది.ఈ వివరాలు అన్నీ మొబైల్ లో నమోదు చేయడానికి ఇప్పుడు మన ప్రభుత్వం VOA లకు 5G స్మార్ట్ ఫోన్స్ ఉచితంగా పంపిణీ చేస్తుంది
అప్పుడు గతంలో 2015 లో VOA లకు TAB లు ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వమే ఇస్తుండడం మన కూటమి ప్రభుత్వం గొప్పతనంగా చెప్పవచ్చు అని అన్నారు..
చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలలో పనిచేస్తున్న 155 మంది సహాయకులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరిగింది..
చీపురుపల్లి – 35,
గరివిడి – 36,
గుర్ల – 40,
మెరకముడిదాం – 44
స్మార్ట్ ఫోన్లు అందజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, నాలుగు మండలాల VOA లు పాల్గొనడం జరిగింది..

