సింహాచలంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షను విరమింపజేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుతైనాల విజయకుమార్

సింహాచలం,ఆగస్టు 8 (మనమే మీడియా):
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న AP Gen-Z WAR కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా సింహాచలం లో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష 3వ రోజు విజయవంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ తైనాల విజయ్ కుమార్ గారు కార్యక్రమానికి హాజరై, దీక్షలో పాల్గొన్న శ్రీమతి సిరమ్మ గారికి, విద్యార్థులుకు, నిరుద్యోగ యువతకు, పార్టీ నాయకులకు నిమ్మరసం అందించి రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా సిరమ్మ గారు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలు నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలలో పారదర్శకత లోపించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో సమగ్ర, పారదర్శక విచారణ జరిపించి అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని, శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి నాయకత్వంలో ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సింహాచలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రి స్వామి, ఈశ్వరరావు, స్థానిక ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళా నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *